తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Katrina kaif: కత్రినా ఇంట్లో పెళ్లి సందడి మొదలైందా?

బ్యూటీ కత్రినా కైఫ్(katrina kaif age) ఇంట్లో పెళ్లి సందడి మొదలైందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 7-9 తేదీల మధ్యల ఈ వేడుక జరగనుందని సమాచారం.

katrina kaif vicky kaushal marriage
కత్రినాకైఫ్

By

Published : Oct 29, 2021, 6:32 AM IST

బాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా మోగనుందా? అంటే అవునేనే సంకేతాలే వస్తున్నాయి. కత్రినాకైఫ్‌ పెళ్లి(katrina kaif height in feet) పీటలెక్కనుందంటూ మరోసారి వార్తలొస్తున్నాయి. కొంతకాలంగా కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌(katrina kaif vicky kaushal dating) ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వింటున్నాం. పలు కార్యక్రమాల్లో ఈ ఇద్దరూ జంటగానే సందడి చేస్తూ కనిపించారు. వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త బాలీవుడ్‌లో సందడి చేస్తుంది.

కత్రినా కైఫ్-విక్కీ కౌశల్

రాజస్థాన్‌లోని ఓ పురాతన కోటలో పెళ్లి వేడుక జరగనుందంటూ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. హిందూ సంప్రదాయం, క్రిస్టియన్‌ పద్ధతుల్లో పెళ్లి వేడుక డిసెంబరు 7 నుంచి 9 వరకూ జరగనుందని సమాచారం. ఇప్పటివరకూ ఈ విషయంపై కత్రినా, విక్కీ.. ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. గతంలో ఓ సారి రోఖా వేడుక జరిగిందంటూ వచ్చిన వార్తల్ని కత్రినా(katrina kaif and vicky kaushal age) ఖండించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details