తమిళ స్టార్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయం దాదాపు ఖరారు అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుణ్ ధావన్‌తో 'ఎక్కిస్' చిత్రాన్ని గతేడాది మొదలుపెట్టిన శ్రీరామ్.. లాక్డౌన్ ప్రభావం, ఆర్థిక సమస్యల కారణంగా దానిని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు విజయ్, కత్రినా కలిసి వేరే కథను తీసేందుకు సిద్ధమయ్యారు.