తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2019, 9:23 AM IST

ETV Bharat / sitara

'సూర్యవన్షీ'లో హీరోయిన్​ ఎవరంటే..?

అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న 'సూర్యవన్షీ'లో కత్రినా హీరోయిన్​గా కనిపించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడీ హీరో.

సూర్యవన్షీ సినిమాలో హీరోయిన్​గా కత్రినా కైఫ్

రణ్​వీర్​ సింగ్ హీరోగా 'సింబా'ను తెరకెక్కించి హిట్ కొట్టాడు రోహిత్ శెట్టి. గతేడాది విడుదలైన ఈ చిత్రం.. పోలీసు పాత్రకున్న పవర్​ ఏంటో మరోసారి నిరూపించింది. ఆ వెంటనే పోలీసు కథతోనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడీ దర్శకుడు. అక్షయ్ కుమార్​ను కథానాయకుడిగా ఖరారు చేశారు. తాజాగా కత్రినా కైఫ్​ను హీరోయిన్​గా ఎంపిక చేసినట్లు ట్విట్టర్​లో తెలిపాడీ కిలాడీ హీరో.

కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటించనుందని అక్షయ్ కుమార్ ట్వీట్

రోహిత్ శెట్టి.. పోలీసు కథలతో అజయ్ దేవ్​గణ్​ హీరోగా సింగం సిరీస్, రణ్​వీర్​తో సింబాను తెరకెక్కించాడు.

అక్షయ్ కుమార్​తో కత్రినా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తోంది. ఇంతకు ముందు 'హమ్కో దివానా కర్ గయే', 'నమస్తే లండన్', 'వెల్​కమ్​', 'సింగ్ ఈజ్ కింగ్' , 'దే దనా దన్' , 'తీస్ మార్ ఖాన్' చిత్రాల్లో కలిసి నటించారు.

ఇది చదవండి: సింబా దర్శకుడితో ఫరాఖాన్...

ABOUT THE AUTHOR

...view details