తమిళనటుడు కార్తీ మరోసారి తండ్రి అయ్యాడు. మంగళవారం తమకు మగబిడ్డ జన్మించినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ అనుభూతిని తమకు పంచిన వైద్యులకు, నర్సులకు కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేమన్నాడు.
"మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. మాకు జీవితాన్ని మార్చే అనుభూతినిచ్చి సహకరించిన వైద్యులకు, నర్సులకు కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. మీ అందరి ఆశీస్సులు మా బిడ్డపై ఉండాలి. ఆ దేవుడికి కృతజ్ఞతలు."