తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ విజయం నమ్మకాన్ని ఇచ్చింది: కార్తికేయ - రాజా విక్రమార్క ట్రైలర్

'రాజావిక్రమార్క'(karthikeya raja vikramarka) సినిమాను హిట్​ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హీరో కార్తికేయ. ఈ విజయం నమ్మకం, సంతృప్తినిచ్చాయని అన్నారు.

karthikeya
కార్తికేయ

By

Published : Nov 14, 2021, 7:17 AM IST

కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌(karthikeya raja vikramarka) జంటగా నటించిన చిత్రం 'రాజా విక్రమార్క'. శ్రీ సరిపల్లి తెరకెక్కించారు. 88 రామారెడ్డి నిర్మించారు. సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు(raja vikramarka movie release date). ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ(karthikeya latest news).. "నమ్మినది జరిగితే.. అది తెలియకుండానే మనకు ఓ కాన్ఫిడెన్స్‌ను అందిస్తుంది. ఆ నమ్మకం, సంతృప్తి నాకు ఈ చిత్రంతో దొరికాయి. ఏ సినిమా చేసినా మనసు పెట్టి చేస్తా. ఈ చిత్రాన్ని మరింత ఎక్కువ ఇష్టపడి చేశా. ఈ ప్రయాణంలో మాకెంతో మద్దతుగా నిలిచిన నిర్మాతలకు మంచి లాభాలు రావాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు.

"త్వరలో కార్తికేయకు పెళ్లి కానుంది. అతనికి ఈ విజయం బిగ్గెస్ట్‌ గిఫ్ట్‌. ఆసక్తికరమైన మలుపులున్న చిత్రమిది. వినోదాన్ని మిళితం చేస్తూ.. దర్శకుడు శ్రీ ఎంతో చక్కగా తెరకెక్కించారు" అన్నారు నటుడు సుధాకర్‌ కోమాకుల. దర్శకుడు మాట్లాడుతూ.. "సినిమా చూసి చాలా మంది బాగుందని చెప్పారు. ఆనందంగా ఉంది" అని అన్నారు. "ఒక ప్రేక్షకుడిగా నేను ఊహించిన దాని కన్నా సినిమా చాలా బాగుంద"న్నారు నటుడు హర్ష వర్ధన్‌.

ఇదీ చూడండి: మోహన్​లాల్​ సినిమాలో మంచులక్ష్మీ!

ABOUT THE AUTHOR

...view details