నేచురల్ స్టార్ నాని... క్రికెటర్ అర్జున్‌గా అలరించిన సినిమా జెర్సీ. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆ జాబితాలోకి హీరో కార్తికేయ కూడా చేరాడు. సినిమా బాగుందని ట్విట్టర్ వేదికగా చెప్పాడు.
'నానితో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది' - జెర్సీ
జెర్సీ సినిమా చూసిన ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ చిత్రబృందాన్ని ప్రశంసించాడు. నానితో కలిసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు.
'ఆర్.ఎక్స్ 100'తో సెన్సేషన్ సృష్టించిన యువ హీరో కార్తికేయ. ప్రస్తుతం హిప్పీ, గుణ 369 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇది కాకుండా నాని 'గ్యాంగ్‌లీడర్' సినిమాలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర చేస్తున్నాడు. గతంలో నానితో కలిసి నటిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేసిన కార్తికేయ.. జెర్సీ సినిమా చూసిన తర్వాత గర్వంగా ఉందని తెలిపాడు.
‘జెర్సీ సినిమా చూశా. నానితో నటిస్తున్నందుకుఇన్నాళ్లు ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు జెర్సీ సినిమాలో అర్జున్ పాత్ర పోషించిన వ్యక్తితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఓ తెలుగు సినిమా అభిమానిగా టాలీవుడ్‌లో నాని లాంటి గొప్ప నటుడు ఉన్నాడని కాలర్ ఎగరేస్తా. గౌతమ్ తిన్ననూరి ఇంత మంచి సినిమా అందించినందుకు శుభాకాంక్షలు. మీరు నవ్వించారు, ఏడిపించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ క్లాసిక్‌ను అందించారు’ -ట్విట్టర్లో హీరో కార్తికేయ