తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అజిత్‌కు విలన్​గా 'గ్యాంగ్​లీడర్​' స్టార్! - KOLLYWOOD NEWS

తమిళ స్టార్ హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' సినిమాలో విలన్​గా యువనటుడు కార్తికేయ కనిపించబోతున్నాడట. ఈ విషయమై కోలీవుడ్​లో జోరుగా చర్చ సాగుతోంది.

అజిత్‌కు విలన్​గా 'గ్యాంగ్​లీడర్​' స్టార్!
హీరో అజిత్- నటుడు కార్తికేయ

By

Published : Dec 17, 2019, 5:15 AM IST

యువహీరో కార్తికేయ.. నాని 'గ్యాంగ్‌ లీడర్'లో విలన్‌గా నటించి, మెప్పించాడు. ఇప్పుడీ పాత్ర మరో అవకాశం తెచ్చిపెట్టింది. కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్‌తో తలపడే పాత్రలో నటించనున్నాడట కార్తికేయ. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

అజిత్‌ కథానాయకుడుగా 'వాలిమై' సినిమా తీస్తున్నాడు దర్శకుడు వినోద్. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించబోతున్నాడని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని, కార్తికేయ అయితేనే సరిపోతాడని భావించిందట చిత్రబృందం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశముంది.

ఇది చదవండి: 'చావు కబురు చల్లగా' చెబుతున్న కార్తికేయ

ABOUT THE AUTHOR

...view details