'ఆర్ఎక్స్ 100'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు హీరో కార్తికేయ. ‘అనంతరం 'హిప్పీ' చిత్రంతో నిరాశపరిచాడు. మూడో సినిమాగా 'గుణ 369' అంటూ ప్రయత్నించినా.. బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో కార్తికేయ - karthikeya
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రానికి '90ఎంఎల్' అనే టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం.
కార్తికేయ
'90ఎంఎల్' టైటిల్ చూస్తుంటే మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇవీ చూడండి:ట్రైలర్: మాస్ లుక్‌లో అదరగొట్టిన వరుణ్
Last Updated : Sep 30, 2019, 12:21 AM IST