'ఆర్ఎక్స్ 100' చిత్రంతో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యువ హీరో కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, గుణ 369, 90ఎంఎల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాడు. తాజాగా ఈ హీరో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ.
కార్తికేయ 'చావు కబురు చల్లగా' - చావు కబురు చల్లగా
'ఆర్ఎక్స్ 100' ఫేం కార్తికేయ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఓ వినూత్న టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.
కార్తికేయ
'చావు కబురు చల్లగా' అనే వినూత్న టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ఇందులో బస్తీ బాలరాజు అనే పాత్రలో కనిపించనున్నాడు కార్తికేయ. కౌశిక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది.
ఇవీ చూడండి.. సానియాతో చరణ్ చిందులు.. వీడియో వైరల్