తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్తికేయ కొత్త సినిమా-'రిపబ్లిక్'​లో రమ్యకృష్ణ లుక్​ - ఒరేయ్​ బామ్మర్ది

హీరో కార్తికేయ తన కొత్త సినిమాను ప్రకటించారు. మెగా హీరో సాయిధర్మ్​ తేజ్​ నటిస్తున్న 'రిపబ్లిక్'​ సినిమాలో నటి రమ్యకృష్ణ లుక్​ విడుదలైంది. ఇంకా పలు చిత్ర విశేషాలు ఉన్నాయి.

Karthikeya
కార్తికేయ కొత్త సినిమా

By

Published : Apr 3, 2021, 4:46 PM IST

Updated : Apr 3, 2021, 6:16 PM IST

హీరో కార్తికేయ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్​ చేశారు. ఇందులో కార్తి తుపాకీ కాల్చుతూ కనిపించారు. యాక్షన్​ బ్యాక్​డ్రాప్​లో ఈ చిత్రంలో ఆయన ఎన్ఐఏ ఆఫీసర్​గా కనిపించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్​ పతాకంపై 88 రామా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవించంద్రన్​ కథానాయిక. శ్రీ సరిపల్లి దర్శకుడు.

మెగా హీరో సాయిధర్మ్​ తేజ్​ నటించిన 'రిపబ్లిక్' సినిమాలో నటి రమ్యకృష్ణ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. "తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం" అంటూ పోస్టర్​పై వ్యాఖ్య జోడించారు. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా ఈ చిత్ర దర్శకుడు. జూన్​ 4న విడుదల కానుందీ చిత్రం.

రిపబ్లిక్​ రమ్యకృష్ణ లుక్​

హీరో సిద్ధార్థ నటిస్తున్న కొత్త చిత్రం 'ఒరేయ్​ బామ్మర్ది'. దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదలైంది. 'బిచ్చగాడు' ఫేం శశి దర్శకత్వం వహిస్తున్నారు.

ఒరేయ్​ బామ్మర్ది

'నగరం' హిందీ రీమేక్ చిత్రం​ 'ముంబయికర్' ఫస్ట్​లుక్​ పోస్టర్​ విడుదలైం ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ శివన్ దర్శకుడు.

ముంబయికర్​ ఫస్ట్​లుక్​ పోస్టర్​
మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​
సీత

ఇదీ చూడండి: అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్​ సీన్​

Last Updated : Apr 3, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details