బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ...కార్తికేయ మూడో సినిమాగా తెరకెక్కుతోంది 'గుణ 369'. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయినట్లు దర్శకుడు అర్జున్ వెల్లడించారు.
'ఇంతకు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మళ్లీ ఏప్రిల్ 29 నుంచి మే 15 వరకు మరో షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఒక పాట మినహా మొత్తం సినిమా రెడీ అయిపోతుంది'.
--దర్శకుడు, అర్జున్ జంధ్యాల
'యథార్థ కథాంశాలతో బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. వినగానే చాలా ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేశాం. లవ్, యాక్షన్ జోనర్‌లో సినిమా ఉంటుంది. హీరో కార్తికేయ `ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ` కన్నా విభిన్నంగా కనిపిస్తాడు'.
- నిర్మాతలు, అనిల్ కడియాల, తిరుమలరెడ్డి