తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈసారి శ్రీ కృష్ణుడి కథతో 'కార్తికేయ 2'

త్వరలో షూటింగ్ మొదలు కానున్న 'కార్తికేయ 2'ను శ్రీ కృష్ణుడి చుట్టూ అల్లుకున్న కథతో రూపొందించనున్నారు. ప్రస్తుతం లోకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు.

karthikeya 2 story revolves sri krishna anthology
nikhil chandoo

By

Published : Oct 5, 2020, 7:19 AM IST

'కార్తికేయ'తో ఓ కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు దర్శకుడు చందు మొండేటి. నిఖిల్‌ హీరోగా నటించిన ఆ చిత్రంయ విజయం సాధించింది. అందులో జంతువుల హిప్నాటిజం నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా, ఈసారి శ్రీకృష్ణుడి చుట్టూ అల్లుకున్న కథాంశంతో 'కార్తికేయ2'ను తెరకెక్కిస్తున్నారు చందు.

ఈ సినిమా షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది. ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉంది చిత్రబృందం. "విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. అరుదైన లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కిస్తాం" అని సినీ వర్గాలు చెప్పాయి.

'కార్తికేయ 2' చిత్రబృందం

ABOUT THE AUTHOR

...view details