హీరో నిఖిల్‌కు పేరు తెచ్చిన సినిమాల్లో ముందువరుసలో ఉండేది 'కార్తికేయ'. దేవుడు గొప్పా? సైన్స్ గొప్పా? అనే కథతో రూపొందిన ఈ చిత్రం.. సినీ వీక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఈ కథానాయకుడు పలు ప్రాజెక్టుల్లో నటించినా, ఆ స్థాయిలో హిట్ దక్కలేదు. ఇప్పుడు మరోసారి 'కార్తికేయ 2' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అందుకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను నేడు విడుదల చేశారు.
5118 ఏళ్ల క్రితం నాటి రహస్యంతో 'కార్తికేయ 2' - entertainment news
నిఖిల్ నటిస్తున్న 'కార్తికేయ' సీక్వెల్‌కు సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేశారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఏడాది ఆఖర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
'కార్తికేయ 2'
రేపటి(సోమవారం) నుంచి తిరుపతిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. మాతృకను తీసిన చందూ మొండేటినే దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Last Updated : Mar 3, 2020, 1:53 AM IST