తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి 'ఖైదీ'కి, కార్తీ 'ఖైదీ'కి తేడా గుర్తించారా? - aawara cinema hero

'ఖైదీ' తెలుగు ట్రైలర్​ సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో కార్తీ విభిన్న వేషధారణలో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి రేపుతున్నాడు.

'ఖైదీ' తెలుగు ట్రైలర్

By

Published : Oct 14, 2019, 11:03 AM IST

Updated : Oct 14, 2019, 12:40 PM IST

కోలీవుడ్​ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఖైదీ'. రెండు భాషల్లో తెరకెక్కుతోంది. సోమవారం తెలుగు ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ పాత్రను పోషించాడీ నటుడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

'10 ఏళ్లు లోపలున్నానని మాత్రమే మీకు తెలుసు.. లోపలికెళ్లే ముందు ఏం చేశానో తెలియదు కదా సార్', 'చావునైనా ఎదురించి చావాలి సార్.. ఇలా కాళ్లమీద పడికాదు' అంటూ కార్తీ చెప్పిన డైలాగ్​లు అలరిస్తున్నాయి.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరైన్, విజయ్ దీనా తదితరులు కనిపించనున్నారు. శామ్ సీఎస్ సంగీతమందించాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్స్​ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: 62 రోజుల పాటు రాత్రులే చిత్రీకరణ జరుపుకున్న కార్తీ 'ఖైదీ'

Last Updated : Oct 14, 2019, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details