తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు రాష్ట్రాల్లో 'ఖైదీ' రికార్డు కలెక్షన్స్ - ఖైదీ సినిమా కలెక్షన్లు

కార్తీ కథానాయకుడిగా నటించిన 'ఖైదీ'.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ12.5 కోట్ల గ్రాస్​ వసూలు చేసినట్లు సమాచారం. ఈ హీరో గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది రికార్డే.

కార్తీ నటించిన 'ఖైదీ'

By

Published : Nov 8, 2019, 4:36 PM IST

కోలీవుడ్​ హీరో కార్తీ నటించిన 'ఖైదీ' పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. కమర్షియల్​ అంశాలు లేకుండా స్క్రీన్​ప్లే, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియులను అలరిస్తోంది. అతడి సహజ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లోకేశ్​ కనకరాజ్ దర్శకుడు.

ఖైదీ సినిమా పోస్టర్

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్లకు పైగా గ్రాస్​ వసూలు చేసినట్లు సమాచారం. కార్తీ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇవి రికార్డు కలెక్షన్స్​గా చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్​ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాల లేకపోవడం వల్ల 'ఖైదీ' మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశముంది.

ఇది చదవండి: 'ఖైదీ-2' వస్తోంది.. దర్శకుడు ట్వీట్!

ABOUT THE AUTHOR

...view details