తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాయ్​ఫ్రెండ్ బాధ్యతల్లో కార్తిక్ ఆర్యన్ బిజీ​! - kooli no.1

బాలీవుడ్​ యువ నటులు సారా అలీఖాన్​, కార్తిక్​ ఆర్యన్​ కలిసున్న ఫొటోలు మరోసారి వైరల్​గా మారాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వాటికి మరింత బలం చేకురుస్తున్నాయి ఈ ఫొటోలు.

బాయ్​ఫ్రెండ్ బాధ్యతల్లో బిజీగా ఉన్న ఆర్యన్​...!

By

Published : Sep 13, 2019, 12:43 PM IST

Updated : Sep 30, 2019, 10:49 AM IST

ప్రముఖ హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌-అమృతాసింగ్‌ దంపతుల కూతురు సారా అలీఖాన్‌.. మరోసారి చర్చనీయాంశమైంది. హీరో కార్తీక్​ ఆర్యన్​తో ఆమె కలిసి ఉన్న ఫొటోలు అంతర్జాలంలో వైరల్​ అవడమే కారణం.

ముంబయిలోని ఓ డ్యాన్స్​ ఇన్​స్టిట్యూట్​ బయట వీరిద్దరూ సందడి చేశారు. వర్షం పడుతుంటేసారాకు గొడుగు పట్టుకొని కారు వరకు జాగ్రత్తగా తీసుకెళ్లాడు ఆర్యన్​. తర్వాత డోర్​ తెరిచి అందులోకి ఎక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది. " ఆర్యన్​... వాట్​ ఏ కేరింగ్​" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే సారా పుట్టినరోజును బ్యాంకాంక్​లో సెలబ్రేట్​ చేశాడు ఆర్యన్​. 'హ్యాపీ బర్త్​డే ప్రిన్సెస్​' పేరుతో కేక్​ కోయించాడు.తొలిసారి వీరిద్దరూ 'కాఫీ విత్​ కరణ్​' షో లో కలిశారు. అప్పటినుంచే ప్రేమాయణం మొదలైనట్లు పుకార్లు వచ్చాయి.

ప్రస్తుతం ఈ జోడీ.. 'లవ్‌ ఆజ్‌ కల్‌ 2'లో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 2009లో వచ్చిన రొమాంటిక్​ కామెడీ 'లవ్​ ఆజ్ ​కల్​'కు సీక్వెల్​ ఇది. 'పతీ పత్నీ ఔర్​ వో' అనే సినిమాలో నటిస్తున్నాడుకార్తీక్​. భూమి ఫెడ్నేకర్​, అనన్య పాండే హీరోయిన్లు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details