బాలీవుడ్లో గతేడాది వచ్చిన 'పద్మావత్' విడుదల విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో తెలిసిందే. చరిత్రను వక్రీకరించి ఈ చిత్రాన్ని తీశారంటూ కర్ణిసేన సినిమా విడుదలను అడ్డుకుంది. మళ్లీ ఇప్పుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న 'పృథ్వీరాజ్'కు కర్ణిసేన నిరసన సెగ తగిలింది. రాజస్థాన్లో జైపుర్ దగ్గర శనివారం షూటింగ్ జరుగుతుండగా అడ్డుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అయితే కర్ణిసేనతో మాట్లాడిన దర్శకుడు చంద్రప్రకాశ్.. తాను పృథ్వీరాజ్ చరిత్రలో మార్పులేం చేయకుండానే సినిమా తీస్తున్నానని చెప్పాడు. కానీ ఈ విషయంలో తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కర్ణిసేన కోరింది. దీనికి అంగీకరిస్తేనే షూటింగ్ జరుగుతుందని తెలిపింది.