తమిళ నటుడు కార్తీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ఖైదీ'. కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ నటుడు.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ఖైదీ' చిరంజీవిని స్టార్‌గా మార్చిన సినిమా. మళ్లీ అదే పేరు మీ చిత్రానికి పెట్టుకున్నారు?
ఇది కావాలని పెట్టింది కాదు. ఈ కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఖైదీ, ఖైదీ నెం.786, ఖైదీ నెం.150.. ఇలా చిరంజీవిగారు చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. అందుకే మా చిత్రానికికి 'ఖైదీ' అని పేరు పెట్టగానే ఓ ప్రత్యేక దృష్టితో చూడడం మొదలుపెట్టారు. మేం మంచి సినిమా తీశాం. ఆ పేరు చెడగొట్టలేదన్న నమ్మకం ఉంది.