తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆమీర్​కు తప్ప ఇంకెవరి కోసమూ ఇలా చేయను' - Amir Khan

ఆమీర్​ ఖాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోంది. అయితే తొలిసారిగా ఈ చిత్రం కోసం ఆడిషన్స్​లో పాల్గొన్నానని, ఆమీర్​ కోసమే ఇలా చేశానని చెప్పింది కరీనా.

Kareena tell a interesting news On Amir Khan
'ఆమీర్​కు తప్ప ఇంకెవరి కోసమూ ఇలా చేయను'

By

Published : Dec 26, 2019, 10:11 PM IST

బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌ అంటే తనకెంతో అభిమానమని ఎన్నో సందర్భాల్లో తెలిపింది కరీనా కపూర్. ప్రస్తుతం ఆమె ఆమీర్‌ఖాన్‌తో కలిసి 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. తన కెరీర్​లో తొలి సారి ఆడిషన్ ఇచ్చిన సినిమా ఇదేనని, ఆమీర్​ కోసమే స్క్రీనింగ్​కు హాజరయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో మొదటిసారి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఆమీర్ ఖాన్ కోసమే స్క్రీనింగ్​కు హాజరయ్యా. ఇప్పటివరకు నేను ఏ సినిమా కోసం ఇలా చేయలేదు. ఈ ప్రపంచంలో ఆమీర్‌ కోసం తప్ప మరెవరి కోసం ఇలా చేయను" -కరీనా కపూర్, బాలీవుడ్ హీరోయిన్​

హాలీవుడ్‌ చిత్రం 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం కరీనా 'గుడ్‌ న్యూస్‌' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, కరీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె 'అంగ్రేజీ మీడియం', 'తఖ్త్‌' సినిమాల్లో నటించాల్సి ఉంది.

ఇదీ చదవండి: వైరల్​: హృతిక్ పాటకు నితిన్ స్టెప్పులు..!

ABOUT THE AUTHOR

...view details