ఆమిర్ ఖాన్-కరీనా కపూర్ మరోసారి వెండితెరపై సందడి చేసే అవకాశముంది. ఆమిర్ తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా'లో కథానాయిక పాత్ర కోసం బెబోను చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తోంది.
తీరిక లేని షెడ్యూల్‌తో కరీనా బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్‌తో 'అంగ్రేజీ మీడియం' సినిమాలో నటిస్తోంది. వచ్చే నెలలో ఓ డాన్స్ షో చిత్రీకరణలో పాల్గొంటుంది. ఆ సమయంలో 'లాల్ సింగ్ చద్దా'లో నటించడంపై బెబో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
3 ఈడియట్స్, తలాష్ వంటి సినిమాల్లో ఆమిర్- కరీనా జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు.
ఆమిర్ ఖాన్- అమితాబ్ కలిసి నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమిర్... హాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు టామ్ హాంక్స్ నటించిన 'ఫారెస్ట్ గంప్' చిత్రం ఆధారంగా లాల్ సింగ్ చద్దాను రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు.
ఇదీ చూడండి:-'ధావన్ బ్యాటింగ్‌కు ఓకే... కానీ ఫీల్డింగ్ కష్టమే'