తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇర్ఫాన్​ సినిమాలో చిన్న రోలైనా ఓకే! - movie

విలక్షణ నటుడు ఇర్ఫాన్​ ఖాన్​ సరసన నటించనుంది కరీనా కపూర్​. 'హిందీ మీడియం' చిత్రానికి సీక్వెల్​గా తెరకెక్కుతున్న 'అంగ్రేజీ మీడియం' లో పోలీసు పాత్రలో కనిపించనుంది బెబో.

కరీనా -ఇర్ఫాన్

By

Published : May 12, 2019, 5:27 PM IST

బాలీవుడ్​లో ముగ్గురు ఖాన్​లతో నటించిన కరీనా కపూర్​ మరో ఖాన్​తో జొడీ కట్టబోతుంది. విలక్షణ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇర్ఫాన్​ ఖాన్​ సరసన నటించనుంది. 'హిందీ మీడియం' కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న 'అంగ్రేజీ మీడియం' చిత్రంలో నటించనుంది బెబో.

"ఇర్ఫాన్​ ఖాన్​తో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. అంగ్రేజీ మీడియం చిత్రంలో నాది చిన్న పాత్రైనా... ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. ఇర్ఫాన్ సినిమాలో చిన్న రోలైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను" -కరీనా కపూర్ ఖాన్​

గత ఏడాది కేన్సర్​ బారిన పడిన ఇర్ఫాన్..​ కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం అంగ్రేజీ మీడియం. ఈ సినిమాలో కరీనా పోలీసు పాత్రలో కనిపించనుంది. హోమీ అడజానియా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details