తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హీరోయిన్​ కాకపోతే అలా అవ్వాలనుకున్నా' - కరీనా కపూర్​ లాయర్​ అవ్వాలనుకుంది

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను నటిని కాకపోయి ఉంటే లాయర్​ అవ్వాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

kareena
కరీనా

By

Published : Jun 20, 2020, 8:12 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​.. తనదైన నటనతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తోంది. వరుస హిట్​ సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ భామ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ నెల​ 30 నాటికి రెండు దశాబ్దాలు పూర్తి అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తాను హీరోయిన్​ కాకపోయి ఉంటే లాయర్​ అవ్వాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

"నాకు చదువుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే అక్క కరిష్మా కపూర్‌తో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. అప్పుడు అక్కలా వెండితెరపై కథానాయికగా కనిపించాలనే ఆశ కలిగింది. అలానే హీరోయిన్​గా మారాను. అయితే చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. లాయర్‌ అవ్వాలని మనసులో మాత్రం గట్టి కోరిక ఉండేది. ఒకవేళ నటి కాకపోయి ఉంటే లాయర్​ అవ్వడానికి ప్రయత్నించేదానిని."

-కరీనా కపూర్​, బాలీవుడ్ హీరోయిన్​.

హీరో సల్మాన్​ఖాన్​తో కలిసి నటించాలనే ఆసక్తి చిన్నప్పటి నుంచి​ ఎక్కువుగా ఉండేదని చెప్పుకొచ్చింది కరీనా కపూర్​.

అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి 'రెఫ్యూజీ' అనే చిత్రంతో కథానాయికగా వెండితెర అరంగేట్రం చేసింది కరీనా. ఆ తర్వాత 'అశోక' చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు సాధించింది. అనంతరం వరుస సినిమాలతో స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ప్రస్తుతం 'లాల్‌ సింగ్‌ చద్దా' చిత్రంలో అమీర్‌ఖాన్‌ భార్య మనీలా చద్దా పాత్రలో నటిస్తోంది.

ఇది చూడండి : బాధ, ఒత్తిడి.. వేర్వేరు భావాలు: దీపికా పదుకొణె

ABOUT THE AUTHOR

...view details