సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్.. ఆమె పిల్లల ఫొటోలను మాత్రం చాలా తక్కువగా షేర్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించిన రెండో కుమారుడు జేహ్ చిత్రాలను కరీనా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్న సందర్భాలు అరుదు. అయితే తాజాగా.. ఆమె రెండో కుమారుడు జేహ్‌ను నిద్రపుచ్చుతున్న ఫొటోను 'లైట్స్.. కెమెరా.. న్యాప్టైమ్' అనే క్యాప్షన్ పెట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కరీనా భుజం మీద వాలి నిద్రపోతున్న చిన్నారి జేహ్ చిత్రాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. భర్త సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు నేపథ్యంలో మాల్దీవులకు వెళ్లిన కరీనా.. అక్కడ భర్త, పిల్లలతో సరదాగా గడుపుతోంది.
మాల్దీవుల్లో కరీనా.. అరుదైన ఫొటోను షేర్ చేసిన బెబో! - కరీనా కపూర్ ఫ్యామిలీ ఫొటోస్
మాల్దీవుల్లో పర్యటిస్తున్న బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్.. ఆమె రెండో కుమారుడు జేహ్ ఫొటోను షేర్ చేసింది. కరీనా.. ఆమె రెండో కుమారుడి ఫొటోలు షేర్ చేయడం అరుదు కావడం వల్ల అభిమానులు ఈ చిత్రాన్ని చూసి మురిసిపోతున్నారు.
మాల్దీవుల్లో కరీనా.. అరుదైన ఫొటోను షేర్ చేసిన బెబో!
ప్రస్తుతం కరీనా.. ఆమిర్ ఖాన్‌తో 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తోంది. అంతేకాదు.. ఇప్పటివరకు నటిగా మాత్రమే కొనసాగిన కరీనా.. ఇప్పుడు నిర్మాతగా కూడా మారనుంది. ఏక్తా కపుర్‌తో కలిసి ఓ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. యూకే నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి :నా పిల్లలను సినిమా స్టార్స్ చేయను: కరీనా కపూర్