తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందరూ బాధ్యతగా ఉండండి: కరీనా - కరీనా కపూర్ కరోనా పోస్ట్

కరోనా విజృంభిస్తోన్న వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్​స్టాలో ఓ పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్. అందరూ బాధ్యతగా ఉండాలంటూ పేర్కొంది.

Kareena Kapoor
కరీనా కపూర్

By

Published : Apr 28, 2021, 10:08 PM IST

కరోనా ప్రతాపం చూపిస్తున్న వేళ ప్రజలు మాస్క్‌ పెట్టుకోవడం సహా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసింది.

"ప్రస్తుతం కరోనా తెచ్చిన దుస్థితి అర్థం చేసుకోలేకపోతున్న వారు మన దేశంలో ఇంకా చాలామంది ఉన్నారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఈసారి మీరు బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కు ధరించండి. వైద్యులు, వైద్య సిబ్బంది మనకోసం ప్రాణాలకు తెగించి ఎంతో పోరాడుతున్నారు. ఈ సందేశం చదివిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండండి. అందరం కలిసి కరోనా గొలుసును తెంచుదాం. ఇప్పుడున్న గడ్డు పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దేశానికి మీరు అవసరం."

-కరీనా కపూర్, నటి

కరీనా కపూర్‌ నటించిన 'లాల్‌సింగ్ చద్దా' ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ ప్రధానపాత్రలో నటించారు. ఇది హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్. నిజానికి ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల అది కుదరలేదు. అలాగే కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న 'తక్త్‌' చిత్రంలోనూ కరీనా నటిస్తోంది. ఆ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌, జాన్వీకపూర్‌, ఆలియాభట్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details