బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 'ప్రెగ్నెన్సీ బైబిల్'(pregnancy bible) అనే టైటిల్‌తో రిలీజ్ అయిన ఈ బుక్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి కావడం గురించి, ఆ కాలంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించింది. ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేసే విషయమై మాట్లాడింది.
"గర్భదారణ సమయంలో స్త్రీలకు భర్త సపోర్ట్ చాలా ముఖ్యం. ఆ సమయంలో మహిళల శారీరక, మానసిక స్థితికి అనుగుణంగా అతను నడుచుకోవాలి. ఆమె నుంచి హాట్నెస్ కోరుకోకూడదు. సెక్స్ చేయాలని ఒత్తిడి చేయకూడదు. ఆడవారి నిర్ణయాలకు, ఇష్టాలకు గౌరవ్వం ఇవ్వాలి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు శృంగారంపై ఆసక్తి కోల్పోయా. నా శరీరం ఏ పనికి సహకరించేది కాదు. చాలా కష్టంగా ఉండేది. ఏడో నెలలో ఉన్నప్పుడు ఉదయం బెడ్ మీద నుంచి లేవలేకపోయేదాన్ని. కానీ దాన్ని అర్ధంచేసుకుని సైఫ్ చాలా మద్దతు ఇచ్చేవాడు. కొన్నిసార్లు ఈ పొట్టమీద హాట్‌గా కనిపించేదానిని. ఈ విషయాన్నే సైఫ్‌తో చెప్పేదాన్ని. అతడు కూడా 'నాతో నువ్వు చాలా అందంగా ఉన్నావని' అనేవాడు."