బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆగస్టు 16న 55వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడి భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. సైఫ్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. పుట్టినరోజు కానుకగా 22 నిమిషాల నిడివి గల వీడియోతో ఆశ్చర్యపరిచింది. సైఫ్ జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగిన ప్రత్యేక సందర్భాలన్నింటినీ అందంగా ఒక్కచోటికి చేర్చి ఈ వీడియోను రూపొందించింది. సైఫ్ తల్లిదండ్రులు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిలా ఠాగూర్, అతడి పిల్లలు మొదటి భార్య అమృత సింగ్ ఇందులో ఉన్నారు.
ఈ వీడియో నిడివి ఎక్కువుగా ఉండటం వల్ల కేవలం మూడు నిమిషాల వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.