బాలీవుడ్లో చాలా మంది తారలు తమ స్థాయి , స్క్రీన్ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటుంటారు. ఇక దర్శకుల విషయానికొస్తే.. కథ రాసుకునే సమయంలోనే ఒక నిర్దిష్ట హీరో, హీరోయిన్లను ఊహించుకుంటారు. వారే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని నిర్ణయించుకుంటారు. అయితే, స్టార్లు ఆ పాత్రను తిరస్కరించినప్పుడు.. మరొక నటుడిని ఆ అవకాశం వరిస్తుంది. అటువంటి పాత్రలు కొన్నిసార్లు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలా కొంత మంది నటీనటులు ఆ పాత్రలను కోల్పోయినందుకు చింతిస్తున్నట్లు చెబితే.. ఇంకొందరు వేరొకరికి స్టార్డమ్ ఇచ్చామని చెబుతుంటారు. ఏదేమైనా తమ కోసం వెతుక్కుంటూ వచ్చిన కొన్ని ఐకానిక్ పాత్రలను తిరస్కరించిన బాలీవుడ్ టాప్-5 నటులపై ఓ లుక్కేద్దాం రండి.
'ది డర్టీ పిక్చర్' చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు వరించింది. అయితే, మొదట ఆ పాత్రకోసం 'మణికర్ణిక' ఫేమ్ కంగనా రనౌత్‌ను అడిగారు. అప్పటికే మరో సినిమాలో నటిస్టుండటం వల్ల.. కుదరదని చెప్పింది. ఆ తర్వాత కంగన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు అందరూ తనను తెలివి తక్కువ దానిలా చూసినట్లు పేర్కొంది.
'రామ్ లీలా'లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జోడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమలో లీలా పాత్రలో నటించిన దీపిక విమర్శల ప్రశంసలు పొందింది. అయితే ఈ పాత్ర ఆఫర్ తొలుత కరీనా కపూర్‌కు వెళ్లగా తిరస్కరించింది.