స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తైమూర్(4), జహంగీర్(6నెలలు)లకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను కలిపి 'ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్‌లో పాల్గొన్న కరీనా.. తన ఇద్దరు పిల్లల గురించి మనకు తెలియని చాలా విషయాల్ని చెప్పింది.
"చిన్నోడికి ఇప్పుడు 6 నెలలు. వాడు అచ్చం నాలాగే ఉంటాడు. కానీ టిమ్(తైమూర్) వాళ్ల నాన్నలా ఉంటాడు. టిమ్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు కొత్తవారిని చూసేందుకు ఇష్టపడేవాడు కాదు. కానీ జహంగీర్ అలా కాదు. టిమ్ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. వాడికి ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్ అంటే ఇష్టం. అయితే జెహ్.. ఏం ఇష్టపడతాడో చూడాలి"
"వారికిష్టమైన రంగంలో ఉంటేనే నేను సంతోషిస్తా. వారు సినీతారలు కావాలని నేను కోరుకోవటం లేదు. జీవితంలో ఏవైపు వెళ్లాలన్నది వాళ్ల ఇష్టం. నా తల్లి కూడా నాకు ఆ స్వేచ్ఛనిచ్చింది" అని కరీనా చెప్పుకొచ్చింది. వాళ్లు ఏ రంగంలోనైనా కింద పడి నేర్చుకుంటేనే.. జీవితం అర్థమవుతుందని తెలిపింది.