తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Kareena Kapoor Khan: కరీనాతో జాగ్రత్త.. సైఫ్‌కు అక్షయ్‌ హెచ్చరిక! - సైఫ్ అలీఖాన్​

Kareena Kapoor Khan: బాలీవుడ్​లో కరీనా కపూర్​, సైఫ్ అలీఖాన్​ జంటకు మంచి క్రేజ్​ ఉంది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు వీరు సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన మరో స్టార్​ హీరో అక్షయ్ కుమార్​​.. కరీనాకు దూరంగా ఉండాలని సైఫ్​తో చెప్పారట.

Kareena Kapoor Khan
కరీనా కపూర్

By

Published : Feb 2, 2022, 6:50 AM IST

Kareena Kapoor Khan: బాలీవుడ్‌ క్రేజీ జోడీల్లో సైఫ్‌ అలీఖాన్‌, కరీనాకపూర్‌ జంట ముందు వరసలోనే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు సంతానంతో హాయిగా గడిపేస్తున్నారు. 'తషన్‌' సినిమా చిత్రీకరణ సమయంలో కరీనా, సైఫ్‌ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్​లో కరీనాతో సైఫ్‌ సన్నిహితంగా ఉండటం గమనించి కరీనాకు దూరంగా ఉండమని సైఫ్‌కు అక్షయ్‌ చెప్పారట. ఈ జోడీ ప్రేమలో పడిన తొలి రోజుల్లో అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ మధ్య జరిగిన ఆసక్తికర విషయాన్ని ఓ ఇంటర్య్వూలో కరీనా పంచుకుంది. ఆ ఇంటర్య్వూ చేసింది అక్షయ్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా కావడం విశేషం.

కరీనా కపూర్

"నేనూ, సైఫ్‌ సన్నిహితంగా ఉండటం గమనించిన అక్షయ్‌.. సైఫ్‌ను ఓ పక్కకు పిలిచి 'ఈ అమ్మాయిలతో చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఉండు' అని హెచ్చరించారు. 'లేదు.. అలాంటిది ఏమీ లేదు. తన గురించి నాకు బాగా తెలుసు' అని సైఫ్‌ చెప్పారు" అని అప్పటి జ్ఞాపకాన్ని పంచుకుంది కరీనా.

ABOUT THE AUTHOR

...view details