అగ్రహీరో ప్రభాస్ నటించనున్న 'ఆదిపురుష్'లో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు గురువారం ప్రకటించింది చిత్రబృందం. దీనిపై స్పందించిన సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్.. తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. 'సైఫ్.. చరిత్రలోనే అత్యంత అందమైన రాక్షసుడు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన 'తానాజీ' చిత్రంలోనూ సైఫ్ విలన్ పాత్ర పోషించడం విశేషం.