తాను భోజన ప్రియురాలినని చెబుతూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఈ ఫొటోలో రెస్టారెంట్లో మెనూ కార్డు చూస్తూ కనిపించిందీ భామ. "జ్ఞాపకాలను లెక్కించండి.. క్యాలరీలను కాదు" అనే ఓ వ్యాఖ్యను కూడా జోడించింది.
'జ్ఞాపకాలను లెక్కించండి.. క్యాలరీలు కాదు' - కరీనా కపూర్ లేటెస్ట్ న్యూస్
ఆహారంపై మక్కువ చూపించే బాలీవుడ్ నటి కరీనా కపూర్.. తాను రెస్టారెంట్‌కు వెళ్లి మెనూను చూస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
!['జ్ఞాపకాలను లెక్కించండి.. క్యాలరీలు కాదు' Kareena Kapoor is in for counting memories, not calories!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8595569-1076-8595569-1598624967671.jpg)
'జ్ఞాపకాలను లెక్కించండి.. కేలరీలను కాదు'
ఆహారం పట్ల కరీనా ప్రేమ చూపించడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో బర్గర్ వీడియోను షేర్ చేసింది.
తమకు రెండో సంతానం కలగబోతున్నట్లు ఆగస్టు 12న ప్రకటించారు సైఫ్-కరీనా. 2012 అక్టోబరులో పెళ్లి చేసుకున్న వీరికి ఇప్పటికే మూడేళ్ల తైమూర్ అలీఖాన్ ఉన్నాడు.