బాలీవుడ్ నటి కరీనా కపూర్ మంగళవారం ఓ ఫొటోషూట్లో పాల్గొంది. దాని కోసం సిద్ధమవుతున్న క్రమంలో తీసిన ఓ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. తన యోధుల సహాయంతో షూట్ కోసం రెడీ అవుతున్నట్లు తెలిపింది. అందులో కరీనా అద్దంలో చూసుకుంటుండగా.. ఆమె సహాయక సిబ్బందిలో ఒకరు మేకప్ వేస్తున్నారు.
నాకు సహకారాన్ని అందిస్తున్న యోధులు వీరే' - కరీనా కపూర్ ఫొటోషూట్
దాదాపు ఐదు నెలల విరామం తర్వాత తిరిగి తన పనిని ప్రారంభించినట్లు వెల్లడించింది బాలీవుడ్ నటి కరీనా కపూర్. మంగళవారం ఓ ఫొటోషూట్లో పాల్గొన్న ఈ నటి దానికి సంబంధించిన ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది.
నాకు సహకారాన్ని అందిస్తున్న యోధులు వీరే: కరీనా
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కరీనా సిబ్బంది తగిన జాగ్రత్తలు చేపడుతున్నారని ఆ చిత్రం ద్వారా తెలుస్తోంది. "మరో రోజు, మరొక షూట్.. నా యోధులు.. మిస్ యూ పూనీ" అని పోస్ట్ చేసింది కరీనా కపూర్.
ఆమెకు సంబంధించిన కొన్ని విశేషాలను ఇన్స్టాగ్రామ్లో తరచుగా పంచుకుంటూ ఉంటుంది నటి కరీనా. ఇటీవలే వినాయక చవితి రోజున తన కుమారుడు తైమూర్ అలీఖాన్ లెగో ఇటుకలతో చేసిన గణేశ్ విగ్రహానికి పూజ చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది .