కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఈ క్రమంలోనే మూడు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి యాంటీ మైక్రోబియల్ టీ షర్టులను అందజేసింది. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), ముంబయికి చెందిన లోకమాన్య తిలక్ మున్సిపల్ హాస్పిటల్, బెంగళూరులోని సక్రా వరల్డ్ ఆస్పత్రిలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ టీ షర్టులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేసింది.
"మనమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. ఒకరినొకరు రక్షించుకునేందుకు చేయగలినదంతా చేస్తున్నాం. అయితే వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి, వారి ప్రేమకు ధన్యవాదాలు. ప్రపంచమంతా ఈ మహమ్మారి వ్యాపించి అందరూ ఇళ్లకే పరిమితమైతే.. మీరు మాత్రం మమ్మల్ని రక్షించేందుకు యుద్ధం చేస్తున్నారు. మీ సేఫ్టీ కోసం పీపీఈ కిట్లు ధరించడం చాలా ముఖ్యం.. కానీ వాటిని శరీరంపై ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే 'పుమా' కంపెనీ నుంచి మీ కోసం మాస్కులు, యాంటీ మైక్రోబియల్ టీ షర్టులను పంపించాం. దయచేసి వాటిని స్వీకరించండి."