తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్'​.. గోవాకు 'క్రాక్' - గోవాకు రవితేజ

ప్రముఖ కథానాయకులు రామ్​ చరణ్​, ఎన్టీఆర్​, రవితేజ తమ చిత్ర షూటింగ్​లతో బిజీగా ఉన్నారు. మహాబలేశ్వరంలో 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణ జరుగుతుండగా.. 'క్రాక్​' షూటింగ్​ కోసం రవితేజ, గోవాకు పయనమయ్యాడు. అలాగే జైసల్మేర్​లోని బీఎస్​ఎఫ్​ క్యాంపులోని జవాన్లతో ఒక రోజంతా గడిపినట్లు రానా దగ్గుబాటి ట్విట్టర్​లో వెల్లడించాడు.

Kareena Kapoor enjoys winter sun in debut Instagram reel
మహాబలేశ్వరంలో తారక్​-ఎన్టీఆర్​.. జైసల్మేర్​ బోర్డర్​లో రానా

By

Published : Dec 3, 2020, 5:30 PM IST

దర్శకుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. ఇటీవలే భారీ షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. దాదాపు 50 రాత్రుల పాటు సాగిన చిత్రీకరణలో భారీ యాక్షన్ సీక్వెన్స్​ను తెరకెక్కించామని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం మహాబలేశ్వరంలో చిన్న షెడ్యూల్​ జరుగుతోంది. సముద్రపు ఒడ్డున ఉన్న అద్భుత లోకేషన్లలో తారక్​-చరణ్​లపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

  • మాస్​ మహారాజ​ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'క్రాక్​'. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్​ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్​ కోసం రవితేజ గోవాకు పయనమయ్యాడు. విమానంలో మాస్క్​ పెట్టుకుని ప్రయాణిస్తున్నట్లు స్వయంగా వెల్లడించాడు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
  • కొన్ని నెలలుగా తాను ఎన్నో ప్రయాణాలు చేశానని చెబుతోంది హీరోయిన్​ ప్రణితా సుభాష్​. ప్రయాణాల కారణంగా అనేక సార్లు కొవిడ్​ టెస్టు చేయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆమె తొలిసారి కరోనా పరీక్ష చేయించుకున్న సమయంలోని వీడియోను తాజాగా ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.
  • హీరోయిన్​ సాయిపల్లవి, ప్రకాశ్​ రాజ్​, అంజలి, సిమ్రాన్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'పావకధైగల్​'. పరువు హత్యలు, ప్రేమ, అహంకార నేపథ్యంతో రూపొందిన సినిమాను డిసెంబరు 18న నెట్​ఫ్లిక్స్​లో విడుదల చేయనున్నారు. ఇందులో సాయిపల్లవి గర్భవతి పాత్ర పోషించింది. ఈ సినిమా ట్రైలర్​ను ట్విట్టర్​లో షేర్​ చేస్తూ.. "ఇలాంటి దారుణమైన చర్యలు, చరిత్ర నుంచి వస్తున్న నమ్మకాలు పోతాయని ఆశిస్తున్నా" అని సాయిపల్లవి పోస్ట్​ చేసింది.
  • ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఒక రోజంతా జైసల్మేర్​లోని బీఎస్​ఎఫ్​ జవాన్లతో గడిపారు. ఆ రోజు గడిపిన అనుభవం జీవితకాలమంతా ఉంటుందని రానా ట్వీట్​ చేశాడు. అక్కడ యుద్ధ కథలు, బోర్డర్​లో తొలి అనుభవాలు తనలో ఓ గుర్తుగా మిగిలిపోయాయని.. వాటిని ఎప్పటికి మర్చిపోనని అన్నాడు. ఈ అవకాశాన్ని తనకు కల్పించిన డిస్కవరీ ఛానల్​కు ధన్యవాదాలు తెలిపాడు. అయితే జైసల్మేర్​లోని బీఎస్​ఎఫ్​ క్యాంపులో రానా గడిపిన సమాయాన్ని డిస్కవరీ ఛానల్​ త్వరలోనే ప్రసారం చేయనుంది.
  • బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ తొలిసారి ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​లో గురువారం ఓ వీడియో అప్​లోడ్​ చేసింది. శీతాకాలంలో సూర్యుడి కాంతిని ఆస్వాదిస్తూ బ్రేక్​ఫాస్ట్​ చేస్తున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details