వయసు నలభైకి దగ్గరవుతున్నా, చెక్కు చెదరని అందం బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ సొంతం. తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ నుంచి ఆఖరుగా తెరపై కనిపించిన ‘వీర్ ది వెడ్డింగ్’ వరకూ అదే మెరిసే చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో కరీనా అభిమానులను అలరించారు. మూడేళ్ల తైమూర్‌కు తల్లయినా కరీనా కపూర్ ఖాన్, త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరి ఇంతందంగా కనిపించే ‘బేగం పటౌడీ’ ఎంత కఠిన ఆహార నియమాలను ఆచరిస్తారో.. ఏ ప్రత్యేక ఆహారం తీసుకుంటారో అని చాలామంది భావిస్తుంటారు.
కరీనా అందం వెనుక డైట్ సీక్రెట్ ఇదే..! - kareena kapoor food habits
బాలీవుడ్ బెబో కరీనా కపూర్.. నాలుగు పదుల వయసుకు చేరువైనా ఇంకా అగ్రనటిగా దూసుకెళ్తున్నారు. ఇటీవలె రెండోసారి తల్లయిన ఈ భామ.. తన ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. కరీనా డైట్ గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.
అయితే కరీనాలాగా అందంగా, నాజుగ్గా కనపడాలంటే నచ్చిన ఆహారాన్ని ముట్టుకోకుండా.. కీటోజెనిక్, వేగన్, ఫ్రూట్ డైట్ అంటూ రకరకాల డైట్లను అనుసరించాల్సిన అవసరం లేదంటున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. కరీనా డైట్ చాలా మంది భావించే దానికి విరుద్ధంగా ఉంటుందని ఆమె వివరించారు. బెబో రోజువారీ ఆహారంలో పులావ్, మామిడిపళ్లు, జీడిపప్పు, పప్పు, కూరలు లాంటివన్నీ ఉంటాయట. కరీనా రోజూ ఐదు సార్లు ఆహారం తీసుకుంటారంటూ, ఆమె డైట్ ప్లాన్‌ను ఇలా వివరించారు..
- ఉదయం 9 గంటలకు: నానబెట్టిన బాదం పప్పులు/అరటిపండు
- మధ్యాహ్నం 12 గంటలకు: పెరుగన్నం- అప్పడం/రోటీ, పనీర్ కూర, పప్పు
- మధ్యాహ్నం 2 గంటలకు: (స్నాక్స్) బొప్పాయి పండు, వేరుశనగలు, చిన్న సైజు చీజ్ ముక్క లేదా మఖానా
- సాయంత్రం 5-6 గంటలకు: లిచ్చి లేదా మామిడి మిల్క్ షేక్/ మిక్స్చర్ మాదిరిగా ఉండే చివ్‌డా
- రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం: వెజిటబుల్ పలావ్, పాలక్ రోటీ, రైతా/పప్పు అన్నం, కూర
- నిద్రపోయే ముందు: పసుపు లేదా జాజికాయ వేసిన పాలు
ఇవే కాకుండా మధ్యలో ఆకలేసినప్పుడు తాజా పళ్లు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు కూడా లాగించేస్తారట. మరి దాహం వేసినప్పుడు మంచినీరే కాకుండా..నిమ్మరసం, కొబ్బరి నీరు, ఛాజ్ (నల్ల ఉప్పు, ఇంగువ కలిపి మజ్జిగ) వంటి పానీయాలు తీసుకుంటారు.