తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Karate kalyani complaint : 'నాకు ప్రాణభయం ఉంది.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ వార్తలు

Karate kalyani complaint : ఆధ్యాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులతో తనకు ప్రాణభయం ఉందని సినీనటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

Karate kalyani complaint, film actress karate kalyani
శివశక్తి ఫౌండేషన్​పై కరాటే కల్యాణి ఫిర్యాదు

By

Published : Jan 1, 2022, 3:15 PM IST

Karate kalyani complaint : ఆధ్మాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులపై సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ నిర్వాహకులతో తనకు ప్రాణభయం ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులకు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

హిందువుల విరాళాలతో కంపెనీ రుణాలు తీసుకున్నారని నిరూపణ చేయడంతో తనపై అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేయడంతో పాటు... దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కరాటే కల్యాణి కోరింది.

శివశక్తి ఫౌండేషన్​పై కరాటే కల్యాణి ఫిర్యాదు

'శివశక్తి ఫౌండేషన్​పై సీసీలో రెండో తారీఖున ఎఫ్​ఐఆర్ నమోదైంది. ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కోపంతో వాళ్లు ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాళ్ల భక్తులు నామీద దాడి చేసేలా ప్రోవోక్ చేస్తున్నారు. వెబ్ మీడియాల్లో ఫేక్ న్యూస్ రాయిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నేను ఓ సమాజంలో బతుకుతున్నాను. అడవిలో కాదు. నాకు ఫ్యామిలీ ఉంది. ఆధ్యాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ వాళ్లు ప్రజల సొమ్ము రూ.4 కోట్లు తిన్నారు. దానినే నేను ప్రశ్నించాను. నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. అందుకే నామీద దుష్ప్రచారం చేస్తున్నారు. శివశక్తి ఫౌండేషన్​ నుంచి నాకు ప్రాణభయం ఉంది. చంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ల భక్తులు నన్ను కొడితే ఎవరు బాధ్యులు?'

-కరాటే కల్యాణి, సినీ నటి

ఇదీ చదవండి:Actress Karate Kalyani: కరాటే కల్యాణిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details