తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అటకెక్కిన కరణ్​జోహర్ 'తఖ్త్'​.. కారణమిదే! - కరణ్ జోహర్ తఖ్త్ రద్దు

బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'తఖ్త్' చిత్ర షూటింగ్ రద్దయినట్లు సమాచారం. భారీ బడ్జెట్, కరోనా పరిస్థితులు, కఠిన షెడ్యూల్​ నడుమ ఈ సినిమాను తెరకెక్కించడం కష్టమని నిర్మాత కరణ్ జోహర్ భావిస్తున్నట్లు సమాచారం.

Karan Johar's Takht starring Ranveer, Alia, Vicky and Kareena shelved?
అటకెక్కిన కరణ్​జోహర్ 'తఖ్త్'​.. కారణమిదే!

By

Published : Feb 2, 2021, 12:16 PM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్​ జోహర్​ 'తఖ్త్'​ పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులు గడుస్తుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్​డేట్ రాలేదు. దీంతో ఈ చిత్రం సెట్​లోకి అడుగుపెట్టకముందే రద్దయినట్లు బాలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది.

మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబ్, అతడి సోదరుడు దాారాషుకో మధ్య సింహాసనం కోసం జరిగిన పోరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు కరణ్. దారా పాత్రలో రణ్​వీర్ సింగ్, ఔరంగజేబ్​ పాత్రలో విక్కీ కౌశల్​ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఆలియా భట్, కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, జాన్వీ కపూర్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది.​

ఈ చిత్రం దాదాపు 250-300 కోట్లతో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్​లో తెరకెక్కాల్సింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు, భారీ బడ్జెట్​ కారణాల వల్ల ఈ చిత్రాన్ని రద్దు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం కరణ్​.. 'బ్రహ్మాస్త్ర' అనే భారీ బడ్జెట్ చిత్రంతో పాటు 'షేర్షా', 'దోస్తనా 2', 'జగ్ జగ్ జీయో' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఇంతటి కఠిన షెడ్యూల్ సమయంలో 'తఖ్త్' లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం అంత తేలిక కాదని చిత్రబృందం భావిస్తోందట.

ABOUT THE AUTHOR

...view details