తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కుచ్​ కుచ్​ హోతా హై' సీక్వెల్​లో వీరేనా..! - alia bhatt

బాలీవుడ్ క్లాసిక్​ 'కుచ్​ కుచ్​ హోతా హై' చిత్రానికి సీక్వెల్ తీస్తానని అంటున్నాడు దర్శక నిర్మాత కరణ్ జోహర్​. హీరో హీరోయిన్లుగా రణ్​వీర్ సింగ్, ఆలియా భట్, జాన్వీకపూర్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

సినిమా

By

Published : Aug 17, 2019, 6:31 PM IST

Updated : Sep 27, 2019, 7:51 AM IST

సుమారు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'కుచ్‌ కుచ్‌ హోతా హై' చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. దీనికి సీక్వెల్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌.

ఈ మధ్య మెల్​బోర్న్​లో ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ప్రీమియర్‌ షో నిర్వహించారు. అక్కడ మీడియా సమావేశంలో కరణ్‌ జోహార్‌ తన మనసులోని మాటలు వెల్లడించాడు.

"కుచ్‌ కుచ్‌ హోతా హై సినిమాను రీమేక్‌ చేస్తే ప్రధాన పాత్రల్లో రణ్​వీర్ సింగ్, ఆలియా భట్, జాన్వీ కపూర్‌ను తీసుకుంటాను. రాహుల్‌గా రణ్​వీర్, అంజలిగా ఆలియా, టీనాగా జాన్వీ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే నేను ఆ పాత్రల్లో ఈ ముగ్గురిని ఊహించుకున్నాను" -కరణ్​ జోహార్, దర్శక నిర్మాత

1998 అక్టోబర్‌ 16న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్, రాణీ ముఖర్జీ, సల్మాన్‌ ఖాన్, సనా సాయిద్‌ నటించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై కరణ్‌ జోహర్‌ దర్శకత్వం వహించాడు.

ఇవీ చూడండి.. జాన్వీ కపూర్​ ఫీట్​కు అందరూ ఫిదా

Last Updated : Sep 27, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details