తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రికెటర్ అర్జున్.. బాలీవుడ్ ప్రయాణం - షాహిద్ కపూర్

తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 'జెర్సీ' త్వరలో బాలీవుడ్​లో రీమేక్ కానుంది. కరణ్ జోహార్ హక్కుల్ని కొనుగోలు చేశారని సమాచారం. షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు.

క్రికెటర్ అర్జున్.. బాలీవుడ్ ప్రయాణం

By

Published : Jun 26, 2019, 12:30 PM IST

ఇటీవల కాలంలో తెలుగు సినీప్రియుల్ని ఆకట్టుకున్న వైవిధ్యభరిత చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. వెలుగులోకి రాని అనేక మంది సచిన్‌ల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకోని ఈ సినిమాను రూపొందించారు. అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

జెర్సీ చిత్రంలోని కీలక సన్నివేశం

అర్జున్‌ అనే క్రికెటర్‌గా నాని కనబర్చిన నటన ప్రతిఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఇప్పుడీ హిట్‌ చిత్రంపై బాలీవుడ్‌ కన్నుపడింది. త్వరలోనే ఈ సినిమాను హిందీలో పునర్నిర్మించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ కొనుగోలు చేశారని సమాచారం.

మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే 'కబీర్ సింగ్'తో ఆకట్టుకున్న షాహిద్‌ కపూర్‌.. క్రికెటర్ అర్జున్​గా కనిపించనున్నాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 'కబీర్ సింగ్'... తెలుగు బ్లాక్​బాస్టర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ కావడం విశేషం.

ఇది చదవండి: నాని మాటలు వింటే భయమేసిందన్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి


ABOUT THE AUTHOR

...view details