తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాతకు 'ఐకాన్​' పురస్కారం - శ్రుతి హాసన్​

బాలీవుడ్​ దర్శకనిర్మాత కరణ్​ జోహార్​కు(Karan Johar) ప్రతిష్ఠాత్మక 'ఐకాన్​' పురస్కారం దక్కింది. గతవారం వర్చువల్​గా జరిగిన లండన్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ముగింపు వేడుకల్లో ఈ అవార్డును ప్రకటించారు. ఈయనతో పాటు స్టార్​ హీరోయిన్స్​ శ్రుతి హాసన్​, జాన్వీ కపూర్​లు అవుట్​స్టాండింగ్​ ఎచీవ్​మెంట్​ అవార్డుకు ఎంపికయ్యారు.

Karan Johar, Asif Kapadia win Icon Awards at London Indian Film Festival
Karan Johar: ప్రముఖ నిర్మాతకు 'ఐకాన్​' పురస్కారం

By

Published : Jul 12, 2021, 6:35 AM IST

ప్రముఖ బాలీవుడ్​ దర్శకనిర్మాత కరణ్​ జోహార్(Karan Johar)​, బ్రిటిష్​ దర్శకుడు ఆసిఫ్​ కపాడియాలకు(Asif Kapadia) లండన్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​(BFI London Film Festival) 'ఐకాన్​' పురస్కారం దక్కింది. గతవారం ఆన్​లైన్​లో లండన్​ వేదికగా జరిగిన లండన్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ముగింపు వేడుకల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఇదే వేడుకలో శ్రుతి హాసన్​(Shruti Haasan), జాన్వీ కపూర్​లకు(Janhvi Kapoor) అవుట్​స్టాండింగ్​ ఎచీవ్​మెంట్​ అవార్డు దక్కింది. బాగ్రీ ఫౌండేషన్​, బ్రిటిష్​ ఫిల్మ్​ ఇన్​స్టిట్యూట్​లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఐదేళ్ల తర్వాత

కరణ్​ జోహార్(Karan Johar).. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్​వీర్ సింగ్​(Ranveer Singh), అలియా భట్​(Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్​ లెజెండరీ నటీనటులు ధర్మేంద్ర, జయా బచ్చన్​, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించనున్నారు.

ఇదీ చూడండి..దాదా ఇంటికి వెళ్లిన ఆమిర్​కు చేదు అనుభవం!

ABOUT THE AUTHOR

...view details