మలయాళ కథలు తెలుగుకి వరుస కడుతున్నాయి. రీమేక్ కోసం ఒక దాని వెంట మరో కథ తెలుగులోకి వస్తోంది. 'లూసిఫర్', 'అయ్యప్పనుమ్ కోశియుమ్'.. ఇలా ఈ వరుసలోకి మరో కథ కూడా చేరింది. అదే 'కప్పెలా'. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ చేజిక్కించుకుంది.
తెలుగులోకి మలయాళ చిత్రం 'కప్పెలా' - మలయాళ సినిమా వార్తలు
మలయాళ చిత్రాలు తెలుగు పరిశ్రమకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే 'లూసిఫర్', 'అయ్యప్పనుమ్ కోశియుమ్' టాలీవుడ్లోకి రీమేక్ అవుతుండగా.. ఈ వరుసలోకి మరో చిత్రం వచ్చి చేరింది.
కప్పెలా
"ఇద్దరు యువ హీరోలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు" అని 'సితార' సంస్థ వర్గాలు తెలిపాయి.