విభిన్న పాత్రల్లో నటించడం హీరో సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం చేస్తున్న 'కాప్పన్' సినిమాలోనూ అదే రీతిలో కనిపించనున్నాడు. తమిళ నూతన సంవత్సర కానుకగా విడుదలైన ఆ చిత్ర టీజర్ నెట్టింట సందడి చేస్తోంది.
కాప్పన్ తమిళ టీజర్‌పై ఓ లుక్కేయండి..! - సూర్య
తెలుగు, తమిళ భాషల్లో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'కాప్పన్'. ఈ చిత్ర టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాప్పన్ తమిళ టీజర్‌పై ఓ లుక్కేయండి..!
సినిమాలో ఎన్ఎస్జీ కమాండర్ పాత్రలో కనిపించనున్నాడీ హీరో. ఇతర పాత్రల్లో మోహన్‌లాల్, ఆర్య, సాయేషా, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. కె.వి. ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది.
ఇది చదవండి: పంచెకట్టులో సూర్య... అదిరిన ఉగాది కానుక