జావా ఐలాండ్‌లో సూర్య 'కప్పాన్' - తమిళ హీరో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కప్పాన్'. ఈ సినిమా చిత్రీకరణ ఇండోనేషియాలోని జావా ఐలాండ్‌లో జరుగుతోంది.

సూర్య కథానాయకుడిగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కప్పాన్’. మోహన్‌లాల్, ఆర్య, సాయేషా సైగల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా పాట చిత్రీకరణ కోసం జావా ఐలాండ్ వెళ్లింది చిత్రబృందం. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
హ్యారిస్ జైరాజ్ బాణీలు సమకూర్చారు. స్టూడియో గ్రీన్ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. 'కప్పాన్'ను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.