తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్ కమెడియన్​ కూతురు ఫొటో వైరల్ - entertainment news

హిందీ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ.. తొలిసారిగా తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది క్షణాల్లో వైరల్​గా మారింది.

స్టార్ కమెడియన్​ కూతురు ఫొటో వైరల్
కపిల్ శర్మ కూతురు అనైరా

By

Published : Jan 15, 2020, 9:08 PM IST

బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్​ శర్మ.. తండ్రి అయిన తర్వాత, తొలిసారిగా కూతురు ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. దానితో పాటు, ఆత్మీయంగా చూస్తున్న మరో ఫొటోను షేర్​ చేశాడు. " మా హృదయం అనైరా శర్మ" అంటూ రాసుకొచ్చాడు.

కొద్ది గంటల్లోనే ఆ బుజ్జాయి ఫొటో వైరల్​గా మారింది. లక్షల్లో లైకులతో దూసుకుపోతోంది. 2018లో తన స్నేహితురాలు గిన్నీ చరాత్​ను వివాహం చేసుకున్నాడు కపిల్. గత నెలలో వీరికి పాప జన్మించింది.

కూతురు అనైరాతో కపిల్ శర్మ

'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోతో ప్రఖ్యాతి చెందాడు కపిల్ శర్మ. ఓ షోకు అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న వ్యక్తిగానూ రికార్డు సృష్టించాడు. ఇదే కాకుండా బాలీవుడ్​లో పలు సినిమాల్లో నటించడమే కాకుండా, 'సన్నాఫ్ మంజీత్ సింగ్' నిర్మాతగానూ మారాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details