బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ కథానాయకుడిగా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘83’ అనే టైటిల్ ఖరారు చేశారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రీతమ్ సంగీతం సమకూర్చుతున్నారు.
- 1983లో కపిల్ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ ఎలా సాధించిందనే నేపథ్యంలో సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని కపిల్ పాత్ర కోసం రణ్‌వీర్ అప్పుడే పాఠాలు మొదలెట్టాడు.
- చిత్రంలోని హీరోతో సహా నటీనటులు (రీల్ క్రికెట్ జట్టు) హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అక్కడ ఈ రీల్ కపిల్‌కు నిజమైన కపిల్ క్రికెట్ మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మైదానంలో దిగిన ఫొటోలను రణ్‌వీర్ పంచున్నాడు.