83 movie: కపిల్ దేవ్ రామ్‌లాల్ నిఖంజ్.. 1983 క్రికెట్ ప్రపంచకప్ తర్వాత దేశమంతటా మారుమోగిన పేరు ఇది. అండర్‌డాగ్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన టీమ్ఇండియాను ఛాంపియన్‌గా నిలపెట్టారు. కపిల్ సారథ్యంలో గావస్కర్, మొహిందర్ అమర్నాథ్ వంటి దిగ్గజాలు అద్భుతమైన ప్రదర్శనలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ విజయాన్ని '83' రూపంలో ఇప్పుడు వెండితెరపై చూసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం కోసం కపిల్ దేవ్ అండ్ టీమ్ ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?
అగ్రభాగం కపిల్కే..
నాటి టీమ్ఇండియా ఆటగాళ్లకు చిత్రబృందం రూ. 15 కోట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇందులో అగ్రభాగం కపిల్ దేవ్కే దక్కింది. ఎందుకంటే ఆయన ఏకంగా రూ. 5 కోట్లను ఛార్జ్ చేశారు. మిగతా ఆటగాళ్లకు చిత్రబృందం తలో రూ.కోటిని చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించగా ఆయన సతీమణి రోమీ పాత్రలో దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి :Priyanka chopra: 'స్టార్డమ్ పక్కనపెట్టి.. అవకాశాల కోసం అలా'