తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కపటధారి' టీజర్​ రాకకు వేళాయే - కపటధారి టీజర్​

సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కపటధారి'. ఈ సినిమా టీజర్​ను గురువారం విడుదల చేయనున్నారు.

Kapatadhaari Teaser out on this date
కపటధారి టీజర్​ రాకకు వేళాయే

By

Published : Oct 28, 2020, 7:03 PM IST

'యువకుడు', 'గౌరి'లాంటి చిత్రాలతో నటించి మెప్పించిన ఏయన్నార్‌ మనవడు సుమంత్‌ యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'కపటధారి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నందితా శ్వేత నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ టీజర్​ను సామాజిక మాధ్యమాల వేదికగా హీరో రానా విడుదల చేయనున్నాడు.

రానా

ఈ చిత్రంలో సుమంత్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిగా కనిపించిన పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. సుమంత్‌ సీరియస్‌ లుక్‌తో పాటు ఆర్టికల్‌ 352, ఎఫ్‌.ఐ.ఆర్‌.. వంటి ఆంగ్ల పదాలు, పుర్రె గుర్తుతో టైటిల్‌ లోగోను డిజైన్‌ చేయడం వల్ల వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇందులో నాజర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details