కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న సినిమా 'కబ్జ'. ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. 1947-80 మధ్య సాగే ఓ మాఫియా డాన్ కథతో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. శుక్రవారం ఉపేంద్ర పుట్టినరోజు ఉన్న సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మాస్ లుక్‌లో అలరిస్తున్నారు.
'కబ్జ' లుక్: అండరవరల్డ్ డాన్‌గా ఉపేంద్ర - upendra latest news
ప్రముఖ కథానాయకుడు ఉపేంద్ర 'కబ్జ' సినిమా మరో లుక్ అలరిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన కాలంలోని ఓ అండర్‌వరల్డ్ డాన్ కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు.
'కబ్జ' లుక్: అండరవరల్డ్ డాన్‌గా ఉపేంద్ర
ఈ ఫొటోలో పొడవైన జుత్తుతో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నారు ఉపేంద్ర. వెనక భాగంలో 1947 అంకె కనిపిస్తుంది. సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ సమర్పకులు.