తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాబుని ఎత్తుకోగానే చిరు గుర్తొచ్చాడు' - చిరు తమ్ముడు ధ్రువ

ప్రముఖ కన్నడ నటుడు చిరు సతీమణి ఇటీవలే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై స్పందించిన నటుడు ధ్రువ.. బాబుని చేతుల్లోకి తీసుకోగానే చనిపోయిన తన అన్నయ్య చిరు గుర్తొచ్చాడని అన్నారు.

Dhruva_kannada stars
'బాబుని ఎత్తుకోగానే చిరు గుర్తొచ్చాడు'

By

Published : Oct 24, 2020, 8:25 AM IST

ఇటీవల అకాలమరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. సర్జా కుటుంబానికి ఎంతో సంతోషకరమైన ఈ విషయం గురించి తాజాగా నటుడు ధ్రువ(చిరు సర్జా సోదరుడు) స్పందించారు.

'బాబు రాకతో మా కుటుంబంలో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. మేఘన, బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. హనుమాన్‌కి కృతజ్ఞతలు. బాబుని చేతుల్లోకి తీసుకోగానే అన్నయ్య నాతోనే ఉన్నట్లనిపించింది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను' అని ధ్రువ అన్నారు.

చిరు తనయుడు

ఎమోషనల్​ అయిన ధ్రువ

''పుట్టబోయే చిన్నారి గురించి ఈ ఏడాది వేసవిలో చిరు, నేనూ సరదాగా మాట్లాడుకున్నాం. 'నీలాగే బాబు పుడితే నీ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది' అని అడిగాను. దానికి చిరు.. 'స్కూల్‌లో చదువుతున్నప్పుడు నాపై ఎన్నో కంప్లైట్స్‌ వచ్చేవి. దీంతో అమ్మవాళ్లు చాలాసార్లు స్కూల్‌కి వచ్చారు. ఒకవేళ నాకు నాలాంటి బాబు పుడితే.. తప్పకుండా వాడి గురించి ప్రతిరోజూ ఎన్నో కంప్లైట్స్‌ వింటా’ అని చెప్పాడు'' అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ధ్రువ ఎమోషనలయ్యారు. నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరు సర్జా ఈ ఏడాది జూన్‌ 7న గుండెపోటుతో మృతి చెందారు.

ఇదీ చదవండి:'లైవ్​ టెలీకాస్ట్'​ ఫస్ట్​లుక్​.. భయపెడుతోన్న కాజల్​

ABOUT THE AUTHOR

...view details