ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రియదర్శన్ ముందుంటాడు. ప్రస్తుతం మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న 'మరక్కర్: అరబికడలినేట్ సింహం' అనే మలయాళి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు ప్రియదర్శన్. హిందీలో 'హంగామా2' చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో కన్నడ భామ ప్రణిత సుభాష్ కథానాయికగా నటించనుంది. ఎంతో మందిని వడపోసిన తరువాత కథానాయికగా ప్రణితను ఎంపిక చేశాడట దర్శకుడు ప్రియదర్శన్.
బాలీవుడ్‌కు 'అత్తారింటికి దారేది' హీరోయిన్..! - హంగామా2 లో హీరోయిన్గా ప్రణిత
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హిందీలో 'హంగామా2' చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో కన్నడ భామ ప్రణిత సుభాష్ కథానాయికగా నటించనుంది. హీరోయిన్గా ఎంతో మందిని వడపోసిన తర్వాత ఈమెను ఎంపిక చేశాడట దర్శకుడు ప్రియదర్శన్.
ప్రియదర్శన్ 'హంగామా2'లో ప్రణిత
ప్రణిత ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ హీరోగా వస్తున్న 'భుజ్: ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా'లో నటిస్తోంది. కన్నడలో 'రమణ అవతార' చిత్రాన్నీ చేస్తోంది. తెలుగులో 'బావ', 'రభస', 'అత్తారింటికి దారేది', 'బ్రహ్మోత్సవం' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా 'ఎన్.టి.ఆర్: కథానాయకుడు' చిత్రంలో అలనాటి నటి కృష్ణ కుమారి పాత్రలో నటించి మెప్పించింది.
ఇది చదవండి: పవన్ కల్యాణ్ 'జార్జ్‌రెడ్డి' పాత్ర చేయాలనుకున్నారు!